గండిపేట, వెలుగు: త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ దంపతులు ఆదివారం ముచ్చింతల్‌లో ఉన్న సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, సేవాభావం, మానవతా విలువలను పెంపొందించడంలో శ్రీ రామానుజాచార్యుల బోధనలు కీలకమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో సమతామూర్తి సందేశం ఎంతో గొప్పదన్నారు.
