కేంద్ర మాజీ మంత్రి కావూరి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కావూరి కన్నుమూత

 

  • బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతూ తుదిశ్వాస 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) మృతి చెందారు. ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ ​బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్​ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి విషమించి, తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. కావూరికి భార్య హేమలత, నలుగురు సంతానం ఉన్నారు. బంజారాహిల్స్ లోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.