కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. శుక్రవారం ( మార్చి 27 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం అగసనూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు కర్ణాటకలోని కురుడి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. కురుడి గ్రామం నుంచి 15 మంది కందుకూరులోని బంధువుల ఇంట్లో పెళ్ళికి వచ్చారని... వారిలో నలుగురు తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి మృతి చెందినట్లు తెలిపారు పోలీసులు.
ఒక పక్క బంధువుల ఇంట్లో పెళ్లి, మరో పక్క శ్రీరామనవమి నాడు నలుగురు మృతి చెందటంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు.
