కాన్వాయ్ పై ఉగ్ర దాడి..14 మంది జవాన్లు మృతి

కాన్వాయ్ పై ఉగ్ర దాడి..14 మంది జవాన్లు మృతి

పశ్చిమాఫ్రికాలోని  నైజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 14 మంది జవాన్లు మృతిచెందారు. 2020 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సనమ్ జిల్లాలో  ఓటర్ల నమోదుకు భద్రతగా వెళుతున్న జవాన్ల కాన్వాయ్ పై  ఉగ్రవాదులు  మెరుపు దాడి చేశారు. 14 మంది జవాన్లు చనిపోగా మరొక  జవాన్ తప్పిపోయినట్లు అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది. కొందరు ఉగ్రవాదులు కూడా చనిపోయినట్లు ప్రకటించింది. ఉగ్రవాదుల దాడితో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులు గత కొన్ని రోజులుగా నైజర్ పై దాడులకు పాల్పడుతున్నారు.