IPL 2026: ఆర్సీబీకి దెబ్బ మీద దెబ్బ: ఆరంభ మ్యాచ్‎కు ముందే మరో స్టార్ బౌలర్ దూరం

IPL 2026: ఆర్సీబీకి దెబ్బ మీద దెబ్బ: ఆరంభ మ్యాచ్‎కు ముందే మరో స్టార్ బౌలర్ దూరం

బెంగళూర్: మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచులో తలపడనున్నాయి. ఈ తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ నువాన్ తుషార టోర్నీ ప్రారంభ మ్యాచుకు దూరమయ్యాడు. 

ఫిట్‌నెస్ పరీక్షలో విఫలం కావడంతో నువాన్ తుషారకు శ్రీలంక క్రికెట్ ఎన్ఓసి (NOC) నిరాకరించింది. దీంతో అతడు ఐపీఎల్ తొలి మ్యాచుకు అందుబాటులో ఉండే అవకాశం లేకుండాపోయింది. శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే డి సిల్వా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఐదు వేర్వేరు ఫిట్‎నెస్ పరీక్షల్లో 29 పాయింట్లకు గాను పాస్ స్కోరు (17)ను సాధించడంలో తుషార ఫెయిల్ అయ్యాడని తెలిపారు.

 దీంతో అతడికి ఐపీఎల్‎లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అతడికి ఎన్వోసీ నిరాకరించింది. ఇప్పటికే ఆర్సీబీ ప్రధాన బౌలర్ యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగాడు. మరో స్టార్ పేసర్ హేజిల్‎వుడ్ గాయపడటంతో అతడు ఆడతాడా లేదా అన్న అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫిట్‎నెస్ సమస్యల కారణంగా నువాన్ తుషార దూరం కావడం ఆర్సీబీకి భారీ ఎదురు దెబ్బేనని అంటున్నారు విశ్లేషకులు. 

ALSO READ : రకుల్ ప్రీత్ సింగ్ భర్త దగ్గర రూ.20 కోట్ల ఖరీదైన ఫ్లాట్ కొన్న శుభమన్ గిల్

అయితే, మరో ఐదు రోజుల్లో ఫిట్‎నెస్ నిరూపించుకునేందుకు అతడికి మరో అవకాశం ఇస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయితే మాత్రం తుషార మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. ప్రారంభ మ్యాచుకు తుషార కూడా దూరం కావడంతో అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీ బరిలోకి దిగొచ్చు.