రకుల్ ప్రీత్ సింగ్ భర్త దగ్గర రూ.20 కోట్ల ఖరీదైన ఫ్లాట్ కొన్న శుభమన్ గిల్

రకుల్ ప్రీత్ సింగ్ భర్త దగ్గర రూ.20 కోట్ల ఖరీదైన ఫ్లాట్ కొన్న శుభమన్ గిల్

ముంబై: టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ముంబైలో అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో రూ.20.7 కోట్లు వెచ్చించి 3,300 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం గల విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ కొన్నాడు. నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానికి చెందిన పూజా లీజర్ అండ్ లైఫ్‌స్టైల్ అనే కంపెనీ నుంచి ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు గిల్. 

ఈ అపార్ట్‌మెంట్ జుహు తారా రోడ్డులోని పూజా లుమినేర్ అనే నివాస భవనంలో ఉంది. అపార్ట్మెంట్ 12వ అంతస్తు మొత్తాన్ని కొనేశాడు గిల్. 2026, మార్చి 26న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాడు గిల్.

 మహారాష్ట్ర రెరా పోర్టల్ ప్రకారం.. ఈ భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 2029, ఆగస్టు 2029 నాటికి పూర్తి కానుంది. కాగా, భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా ముంబైలో ఇటీవల ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

ఐపీఎల్‎పై ఫోకస్:

టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్‎లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియా, ఆసియా కప్, విజయ్ హాజరే ట్రోఫీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పూర్ ఫామ్ కారణంగా 2026 ఫిబ్రవరి–మార్చిలో జరిగిన టీ20 వరల్డ్ కప్‎ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ఈ 26 ఏళ్ల క్రికెటర్. 

భారత వన్డే, టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ కీలకమైన టీ20 వరల్డ్ కప్‎కు బీసీసీఐ గిల్‎ను పక్కన పెట్టిందంటే అతడి ఫర్ఫామెన్స్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మార్చి 28 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‎పై గిల్ ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్‎లో గుజరాత్ సారథిగా వ్యవహరిస్తోన్న గిల్ తిరిగి ఫామ్‎లోకి వచ్చి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు.