ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. 130 సీట్లకు కామన్ ఎంట్రన్స్

ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. 130 సీట్లకు కామన్ ఎంట్రన్స్

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్​విడుదలైంది. మొత్తం కోర్సుల్లో 130 సీట్లకు కామన్​ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు యూనివర్సిటీ అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీటెక్​కంప్యూటర్స్​అండ్​ఏఐలో 30 సీట్లు, బీఎస్సీ (హానర్స్​) కంప్యూటర్​ సైన్స్​అండ్ డేటా అనలిస్ట్ లో 25, బీఎస్సీ (హానర్స్​) మ్యాథమెటిక్స్ అండ్​కంప్యూటింగ్ లో ​25, బీఏ (హానర్స్​) ఇంగ్లీష్ లో 25​, బీఏ (హానర్స్​) ఎకనామిక్స్​25 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులకు ఆగస్టు 2వ తేదీ https://ssctucuet.samarth.edu.in/ వెబ్​సైట్ లో అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు. 5న మెరిట్ లిస్ట్, 10న కౌన్సిలింగ్​నిర్వహించనున్నారు. మొదటి ప్రాధాన్యంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్, రెండో ప్రాధాన్యంగా జేఈఈ మెయిన్స్ ర్యాంక్  ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీలో కానీ, వెబ్​సైట్ లో కానీ చూసుకోవచ్చన్నారు.