న్యూఢిల్లీ: నీట్ -పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్థలోని 47 మంది అధికారులను, సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలకు కూడా సిద్ధమవుతోంది. దేశంలో నీట్, జేఈఈ మెయిన్, సీయూఈటీ వంటి దాదాపు 20 ప్రధాన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్టీఏనే నిర్వహిస్తోంది.
అయితే, ఇటీవల చోటు చేసుకున్న లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో అధికారులపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం అధికారుల తొలగింపుతో సరిపెట్టకుండా, పరీక్షల అవుట్‌సోర్సింగ్ విధానంలో ప్రాథమిక మార్పులు తేనుంది.
