హైదరాబాద్, వెలుగు: మీడియా అవుట్ సోర్సింగ్, యాడ్ సేల్స్, డిజిటల్ మార్కెటింగ్‌లో దశాబ్దాలకు పైగా మీడియా పరిశ్రమలో ఒక శక్తిగా ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ ఆవిర్భవించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ 15 ఏండ్ల మీడియా ఎక్సలెన్స్‌ను జరుపుకుంటుంది. జాతీయ మార్కెట్‌లో నమ్మకమైన మీడియా సంస్థగా ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ గుర్తింపు పొందింది. దేశంలో పుతియతలైమురై న్యూస్, వీ6 న్యూస్, వీ6 వెలుగు, ఆర్.కన్నడ, రిపబ్లిక్ నెట్‌వర్క్, పుతుయుగం, ఆర్ట్ క్యూబ్ ఏఐ వంటి ప్రముఖ వార్తలు, ఎంటర్‌టైన్మెంట్ నెట్‌వర్క్‌లతో సక్సెస్‌ఫుల్‌గా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో బి.శంకర్ మాట్లాడుతూ.. ‘‘మా సంస్థ 15 ఏండ్లు (క్రిస్టర్ జూబ్లీ) పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉంది. ఒక ప్రాంతీయ సంస్థగా ప్రారంభమైన కంపెనీ, విశ్వసనీయత, పనితీరుపై నేడు జాతీయ మీడియా సంస్థగా ఎదిగింది. మార్కెట్లపై మాకున్న అవగాహన, మా భాగస్వాములతో కలిసి వృద్ధి చెందగల సామర్థ్యమే మా బలం”అని తెలిపారు.
