23, 24, 25 తేదీల్లో నీట్​పై ఫ్రీ అవేర్నెస్​ క్లాసెస్

23, 24, 25 తేదీల్లో నీట్​పై ఫ్రీ అవేర్నెస్​ క్లాసెస్

ముషీరాబాద్, వెలుగు: నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్​పై ఉచితంగా అవగాహన కల్పించేందుకు ఈ నెల 23, 24, 25 తేదీల్లో క్లాసులు నిర్వహిస్తున్నామని దోమలగూడలోని మెటా మైండ్ నీట్ అకాడమీ పేర్కొంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే యువతుల కోసం ఉచిత హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపింది. నిపుణులు, సీనియర్ లెక్చరర్లు సలహాలు, సూచనలు ఇస్తారని అకాడమీ నిర్వాహకులు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన స్టూడెంట్లు ఫ్రీ క్లాసులను ఉపయోగించుకోవాలని కోరింది. మరిన్ని వివరాలకు 85229 58575, 70322 64910 నంబర్లను సంప్రదించాలని కోరింది.