హైదరాబాద్ సిటీ, వెలుగు : వనమహోత్సవంలో భాగంగా హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్ లో నిర్వహిస్తున్న నర్సరీ మేళా ప్రాంగణంలో కుటుంబానికి 5 మొక్కల చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిలో పండ్లు, ఔషధ, అలంకరణ మొక్కలు ఉంటాయి.
