శంషాబాద్, వెలుగు: ముచ్చింతల్‌లోని స్వర్ణ భారత్ ట్రస్టులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో మగ్గం వర్క్‌పై ఫ్రీ ట్రైనింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ జి. కృష్ణ తెలిపారు. 30 రోజుల పాటు కోర్సు నిర్వహిస్తుండగా..ఈనెల 21 నుంచి ప్రారంభించి ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు తరగతులు ఉంటాయన్నారు. 19-–45 ఏండ్ల వయసు వారు అర్హులని తెలిపారు.
కోర్సు కాలంలో ఫ్రీ మీల్స్, వసతి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్, రేషన్ కార్డ్, 3 ఫొటోలు తేవడంతో పాటు కచ్చితంగా చదవడం, రాయడం రావాలన్నారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలని, వివరాలకు 9391487797/ 9177141712/9618534720 నంబర్లను సంప్రదించాలని కోరారు.
