‘ప్రాజెక్ట్ కె’ ప్రత్యేకమైన చిత్రం : ప్రభాస్

‘ప్రాజెక్ట్ కె’ ప్రత్యేకమైన చిత్రం : ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్’ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు ‘సాలార్‌‌‌‌‌‌‌‌’.. మరోవైపు ‘ప్రాజెక్ట్‌‌‌‌ కె’, ‘ఆది పురుష్’  షూటింగ్స్‌‌‌‌ జరుగుతున్నాయి. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా Project K తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

హీరోయిన్‌ దిశా పటానీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా కొనసాగుతున్న ఈ మూవీ మేకింగ్ కు సంబంధించిన ఒక వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేశారు. స్క్రాచ్‌ ఎపిసోడ్‌ 1: రీ ఇన్వెంటింగ్‌ ది వీల్‌ అంటూ వీడియో స్టార్ట్ అయ్యింది. నాగ్ అశ్విన్ టీం ఓ టైరు తయారు చేస్తుంటారు. ఒక్క టైర్ కోసం చిత్ర బృందం ఎలా కష్టపడిందో కళ్లకు కళ్లినట్లు ఇందులో చూపించారు. టైర్ కోసం ఇంత ఓవరాక్షన్ అంటూ టీంలోని సభ్యులు మాట్లాడుకున్నారు. చివరిలో యాక్షన్ అంటూ.. వాళ్లు తయారు చేసిన టైర్ ను చూపించారు. ఇనుప సంకెళ్లతో తయారు చేసిన టైర్ కథ ఏంటీ ? దాని ప్రాముఖ్యత ఏంటీ అనేది తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ కావాల్సిందే. 

ProjectK అనేది టైమ్ ట్రావెల్ సినిమా కాదన్నారు నటుడు ప్రభాస్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘టైమ్ మెషిన్, టైమ్ ద్వారా ప్రయాణించడం కలిగి ఉండదు. ఇదొక కొత్త జానరే కాక పూర్తిగా ప్రత్యేకమైన చిత్రం" అని తెలిపారు.