డీఈడీ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాల్సిందే : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్

డీఈడీ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాల్సిందే : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను పక్కాగా అమలు చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌‌లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌‌లో ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లకు ఎఫ్ఆర్ఎస్‌‌పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల హాజరును పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియతో అనుసంధానిస్తున్నామని, తగినంత హాజరు లేని విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులవుతారని తేల్చి చెప్పారు.

కాలేజీలకు వెళ్లకుండా నేరుగా పరీక్షలు రాసేందుకు అవకాశం లేదని, ప్రతి విద్యార్థి రెగ్యులర్‌‌గా క్లాసులకు హాజరు కావాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఇదే విషయంపై విద్యార్థులకు ప్రిన్సిపాల్స్ అవగాహన కల్పించాలని సూచించారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు విధిగా ఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్‌‌వేర్‌‌పై పట్టు పెంచుకోవాలని, అందుకే హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని రమేశ్ తెలిపారు. అటెండెన్స్ డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్ చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు