హైదరాబాద్, వెలుగు: నీరా, దాని అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్‌లతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్, సేల్స్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ వచ్చిందని ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గీత కార్మికుల అభివృద్ధి, సంక్షేమాని కి సీఎం కేసీఆర్ నీరా పాలసీని ప్రవేశ పెట్టారన్నారు. నీరా పాలసీలో భాగంగా నెక్లెస్ రోడ్లో రూ.10 కోట్లతో నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలో అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నీరా కేఫ్‌లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ రావడంపై గౌడ ఐక్య సాధన సమితి స్టేట్ ప్రెసిడెంట్ అంబాల నారాయణ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
