V6 News

ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్‌ సామి

ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్‌ సామి

న్యూడిల్లీ: ప్రముఖ స్పోర్ట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫన్‌88 తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా డారెన్‌ సామిని నియమించింది. ఒకనాటి జగజ్జేత వెస్టిండీస్‌ని రెండుసార్లు టీ20 వల్డ్‌ కప్‌ విజేతగా నిలపడంలో కెప్టెన్‌గా కృషి చేసిన డారెన్ సామికి వెస్టిండీస్ దీవుల్లోనే కాదు..  ఆసియా ఉపఖండంలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. మరీ ముఖ్యంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించడంతో భారత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 
జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్‌ ఫన్‌88 క్రికెట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, కబడ్డి, ఇంకా ఎన్నో క్రీడలకు సంబంధించిన అప్డేట్స్.. రియల్‌ టైమ్‌ న్యూస్‌, విశ్లేషణలను అందిస్తున్న విషయం తెలిసిందే. భారతీయ క్రీడాభిమానులతో రూపొందించే బ్రాండ్‌ ఫిల్మ్స్‌ సిరీస్‌లో పాల్గొంటూ ఈ భాగస్వామ్యానికి సామి శ్రీకారం చుట్టనున్నారు.  డారెన్‌ సామిని ఈ వేదిక ప్రచారక్తరగా చేర్చుకోవడంపై ఫన్‌88 అధికారి ప్రతినిధి మాట్లాడుతూ డారెన్‌ సామి వెస్టిండీస్ లో క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎనలేని కృషి చేశారని.. ముఖ్యంగా రెండు టీ20 వరల్డ్ కప్ లు అందించడంతో మంచి నాయకుడుగా.. అందరికీ ప్రేరణగా నిలిచాడన్నారు.