Gaddar: కొనసాగుతోన్న గద్దర్ అంతిమ యాత్ర..

Gaddar: కొనసాగుతోన్న గద్దర్ అంతిమ యాత్ర..

ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఎల్బీ స్టేడియం నుంచి  అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగనుంది. అంతిమ యాత్రకు జనం భారీగా తరలివచ్చారు. కవులు, ప్రజాసంఘాలు ప్రదర్శన చేస్తున్నారు.  డప్పులు, నృత్యాలు, కాళ్లకు గజ్జె కట్టి ఆడిపాడుతున్నారు. పార్టీలకతీతంగా నేతలు తరలివచ్చారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పొడుస్తున్న పొద్దు అస్తమించడంతో చివరి చూపు చూసేందుకు తరలివస్తున్నారు.

 అల్వాల్ లోని గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచుతారు.  తర్వాత  గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో    ప్రభుత్వ లాంఛనాలతో  అంత్యక్రియలు జరగనున్నాయి.  గద్దర్ సమాధికి అన్ని ఏర్పాట్లు చేశారు. 

గద్దర్‌ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.  ప్రజాగాయకుడు గద్దర్‌ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు తరలివచ్చారు. గద్దర్‌ భౌతికకాయాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.