మైనారిటీలో హర్యానా సర్కారు

మైనారిటీలో హర్యానా సర్కారు

హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలోని 90 సీట్లకు గానూ బీజేపీ 40 సీట్లు గెల్చుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం కాగా ఏడుగురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తాజాగా ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. దీంతో సైనీ సర్కారు బలం 44 సీట్లకు పడిపోయింది.