Actor Shivaji: చీరలోనే అందం.. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు.. హీరోయిన్ల దుస్తులపై శివాజీ షాకింగ్ కామెంట్స్..

Actor Shivaji: చీరలోనే అందం.. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు.. హీరోయిన్ల దుస్తులపై శివాజీ షాకింగ్ కామెంట్స్..

నటుడు శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్  రూపొందించిన చిత్రం ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ డ్రసింగ్ విధానంపై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పొట్టి పొట్టి బట్టలు కాకుండా, సామాన్లు కనిపించే విధంగా కాకుండా కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇపుడు ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. 

శివాజీ మాటల్లోనే.. ‘‘ఈ ఈవెంట్కి యాంకర్ గా చేసిన స్రవంతి డ్రెస్ సెన్స్ బాగుంది. హీరోయిన్స్ కూడా ఎలా బడితే అలా బట్టలు వేసుకోకూడదు. ఆ దరిద్రం మళ్ళీ మనమే అనుభవించాల్సి ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళ అందం అనేది చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతూ బాగుంది అంటారు. కానీ లోపల మాత్రం దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని తిట్టుకుంటారు. మళ్లీ ఇలా అంటే స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతితో సమానం. అందుకే ఆమె ఎంత అందంగా కనిపిస్తే అంత గౌరవం పెరుగుతుంది. మహానటి సావిత్రి, సౌందర్య లాంటి హీరోయిన్స్ చాలా మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. గ్లామర్ కుడా ఓ దశవరకు మాత్రమే ఉండాలి” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ.

అయితే, ఈ మొత్తం స్పీచ్లో దరిద్రపు ము** అనే పదం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ కామెంట్స్ పై సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. 

 తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో.. మన ఆచారాలు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ.. హాస్యం, వ్యంగ్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ‘దండోరా’ తెరకెక్కింది.  ‘చేసే పనినిబట్టే కులం అన్నప్పుడు..  పని మారితే కులం కూడా మారాలి కదా..?’ అనే ఇంటెన్స్ కంటెంట్ తో సినిమా ముందుకు రానుంది. ఇప్పటికే, టీజర్, ట్రైలర్, సాంగ్స్ జనాల్లో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు విడుదలకు ముందు శివాజీ చేసిన కామెంట్స్ ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి!!