ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ‘కాకా’ వెంకటస్వామి వర్ధంతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ‘కాకా’ వెంకటస్వామి వర్ధంతి

నల్గొండ, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి  గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతి ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్‌చార్జి డీఆర్‌‌ఓ వై. అశోక్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు. 

సూర్యాపేట కలెక్టరేట్‌లో..  

కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి సూర్యాపేట ఆర్డీఓ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్  మాట్లాడుతూ..  బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కాకా వెంకటస్వామి పోరాటం చేశారని ఆయన సేవలని కొనియాడారు. ఆయన బాటలో పయనిస్తూ కాకా వెంకటస్వామి ఆశయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో డీఎవో శ్రీధర్ రెడ్డి , డీఈవో అశోక్, సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో  

గడ్డం వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు జేఏసీ జిల్లా కన్వీనర్  వేణు బలరాం ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు ఎర్రమళ్ల రాములు, జిల్లా కో కన్వీనర్ కట్టా సైదులు, కట్ల మురళి, వడ్డేపల్లి నరేశ్, గుయ్యం భాస్కర్, చింతమల్ల అమర్, గండమల్ల విజయ్, వేణు, ప్రవీణ్, సుధాకర్ పాల్గొన్నారు. 

పేదల పక్షపాతి ‘కాకా’

యాదాద్రి, వెలుగు: పేదల అభ్యున్నతి కోసం కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి అనునిత్యం పాటుపడ్డారని అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, ఏ.భాస్కరరావు అన్నారు. యాదాద్రి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వర్ధంతి కార్యక్రమంలో కాకా ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్​వో జయమ్మ, డీఆర్​డీవో నాగిరెడ్డి, హౌసింగ్ డీఈ విజయ్​సింగ్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.