నిర్ణీత గడవులోగా సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిర్ణీత గడవులోగా సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ, వెలుగు: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలన్నారు.

 ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల  ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఇంచార్జ్ డీఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌ డే: ఎస్పీ 

ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించే విధంగా ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 37 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.