గండిపేట శారదా పీఠంలో ఉగాది ఉత్సవం..స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అనుగ్రహ భాషణం

గండిపేట శారదా పీఠంలో ఉగాది ఉత్సవం..స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అనుగ్రహ భాషణం

గండిపేట, వెలుగు: కోకాపేటలోని ..విశాఖ శ్రీ శారదా పీఠంలోనూ.. ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా శారదా చంద్ర మౌలీశ్వర ఆరాధన, నిత్య సంతోషిణి బృందం భక్తి సంగీత విభావరి, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

అనంతరం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దేశ క్షేమం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించారు.

ఈ ఉత్సవాల్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే హరీశ్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.