మొహాలీ: తన వందో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. శ్రీలంకతో శుక్రవారం మొదలయ్యే మ్యాచ్‌తో వంద టెస్టుల క్లబ్లో చేరనున్న విరాట్‌ను అభినందించాడు. ‘కొద్దిమంది ఇండియా ప్లేయర్లు మాత్రమే 100 టెస్టులు ఆడారు. ఇదొక గొప్ప మైలురాయి. కోహ్లీ గొప్ప ప్లేయర్. ఈ ఘనతకు తను అర్హుడు. అతడు మళ్లీ సెంచరీతో ఫామ్‌లోకి వస్తాడు. విరాట్‌కు వంద కొట్టడం ఎలాగో తెలుసు. లేదంటే 70 సెంచరీలు ఎలా చేయగలడు’ అని దాదా అభిప్రాయపడ్డాడు.

