ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులపై తిరగబడి రాళ్ల దాడి చేశారు అంర్జాతియ గంజాయి ముఠా. దీంతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. బుధవారం ( జూన్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ దగ్గర తనిఖీలకు వెళ్లారు పోలీసులు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న కారును ఆపి తనిఖీ చేస్తుండగా... పోలీసులపై రాళ్ల దాడికి దిగారు గంజాయి ముఠా.
తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపై గంజాయి ముఠా రాళ్లతో దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ కాలర్ కాలర్ పట్టుకున్నాడని.. దీంతో గాలిలో కాల్పులు జరపడంతో గంజాయి స్మగ్లర్లు వెనక్కి తగ్గారని తెలిపారు పోలీసులు. గాల్లోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు లొంగిపోయారని తెలిపారు పోలీసులు.
ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నామని... వీరు ఆంధ్ర, ఒడిస్సా, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారగా గుర్తించామని తెలిపారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి 209 కిలో గంజాయి, రెండు బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
