హైదరాబాద్ కాచిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. కృష్ణానగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బ్లాస్ట్ ధాటికి ఇంటి పైకప్పు ముక్కలు ముక్కులు అయింది. రేకులు చెల్లాచెదురుగా పడిపోయాయి. 70 ఏళ్ల వృద్ధురాలు ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె ఇంట్లో లేని సమయంలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. సిలిండర్ బ్లాస్ట్ తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ విషయం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు , ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ లీక్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇల్లు ధ్వంసం కావడంతో వృద్ధురాలు రోధిస్తోంది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.
