ఆసియాలో టాప్ కుబేరుడు.. అదానీ

ఆసియాలో టాప్ కుబేరుడు.. అదానీ

ఇప్ప‌టివరకు దేశంలోనే కాదు ఏషియాలోనే అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ. తాజాగా మారిన లెక్క‌ల ప్ర‌కారం అదానీ గ్రూప్‌ల అధినేత గౌత‌మ్ అదానీ ఏషియా నంబర్‌ కుబేరుడిగా అవ‌త‌రించారు. ముఖేష్ అంబానీని అధిగ‌మించి ఆసియా కుబేర కిరీటాన్ని త‌న సొంతం చేసుకున్నారు.  ఫిబ్రవరి 8న బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో వీరిద్దరి స్థానాలు మారాయి. బ్లూంబర్గ్‌ ప్రపంచ కుబేరులు 500 జాబితాలో ఫిబ్రవరి 8న మార్పులు జరిగాయి. ఇందులో గౌతమ్‌ అదానీ సంపద 88.50 బిలియన్‌ డాలర్లు ఉండగా ముకేశ్‌ అంబానీ సందప 87.90 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ముకేశ్‌ కంటే అదాని సంపద 600 మిలియన్లు ఎక్కువగా నమోదైంది. దీంతో ఏషియాలోనే నంబర్‌ వన్‌ ధనవంతుడిగా అదానీ అవతరించారు. అంతకు ముందు ఈ స్థానం ముకేశ్‌ పేరిట ఉండేది.

బ్లూంబర్గ్ ఇండెక్స్‌లో ప్రపంచ కుబేరుల జాబితాలో ఇప్పటి వరకు పదో స్థానంలో కొనసాగుతూ వచ్చిన ముఖేశ్‌ అంబానీ తాజాగా 11వ స్థానానికి పడిపోగా.. గౌతమ్‌ అదాని 11వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరుకున్నారు. ఏడాది కాలంలో ముకేశ్‌ అంబానీ సంపద 2.07 బిలయిన్లు తరిగిపోగా.. అదానీ సంపద 12 బిలియన్లు పెరిగింది. 

మరిన్ని వార్తల కోసం..

కర్నాటకలో విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు