కర్నాటకలో విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు

కర్నాటకలో విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు

హిజాబ్‌ వివాదం కారణంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీనికి సంబంధించి  సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విటర్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కాలేజీల యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదన్నారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం..

మోడీ డ్రెస్ కోడ్ మారింది తప్ప మిగతా ఏం మారలేదు