లక్నో మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌

లక్నో మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాకుండా ఓ  మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రికెటర్లను గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా చేరిన  లక్నో ఫ్రాంచైజీ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించుకుంది. ఆర్పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ గ్రూపుకు చెందిన లక్నో ఫ్రాంచైజీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు ఇంకా డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వలేదు. ‘నాకు అద్భుతమైన అవకాశమిచ్చిన ఆర్పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొయెంకాకు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. పోటీ గెలవాలన్న తపన నాలో ఇంకా ఉంది. అయితే, ఈసారి డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పోరాడటం లేదు. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు, గౌరవం కోసం వస్తున్నా’ అంటూ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ ప్రకటన రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రెండు టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాడు. 58 టెస్టులు, 147 వన్డే, 37 టీ20ల్లో ఇండియాకు ఆడాడు. క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అద్భుతమైన రికార్డులు ఉన్న గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఆహ్వానిస్తున్నామని, అతనితో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొయెంకా అన్నారు.