ఆఫ్రిదీకి గంభీర్ కౌంటర్ : ఇండియా గురించి మేం చూస్కుంటాం

ఆఫ్రిదీకి గంభీర్ కౌంటర్ : ఇండియా గురించి మేం చూస్కుంటాం

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తీవ్రంగా విమర్శించాడు. కశ్మీరీ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంటే ఐక్యరాజ్యసమితి నిద్రపోతోందన్నాడు. కశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని ఆఫ్రిదీ కోరాడు.

ఆఫ్రిదీ కామెంట్స్ లపై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపి గౌతం గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. పీఓకేనూ సరిచేస్తాం.. ఆందోళన చెందకు అని చెప్పాడు. మానవ హక్కుల ఉల్లంఘన పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందన్న విషయాన్ని చెప్పడం షాహిద్ మర్చిపోయారన్నాడు. ఇండియా గురించిగానీ..కశ్మీర్ గురించి ఆఫ్రిదీ కంగారు పడాల్సిన అవసరం లేదని.. అన్ని విషయాలను తాము చూసుకుంటామని ఆఫ్రీదికి తనదైన స్టైల్లో చురకలంటించాడు గౌతమ్ గౌంభీర్.