అఫ్రిది విమర్శలకు గంభీర్ కౌంటర్
న్యూఢిల్లీ: ఆటలో అయినా, మాటల్లో అయినా తనను కవ్వించిన వారిపై దీటుగా స్పందించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ .. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది విమర్శలను తిప్పి కొట్టాడు. తనకు వ్యక్తిత్వమే లేదని ఆటోబయోగ్రఫీలో రాసుకున్న అఫ్రిదికి మతి భ్రమించినట్టుందన్నా డు. అతను ఇండియా వస్తే సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ ఇప్పిస్తానని చురకలు అంటించాడు. ‘అఫ్రిది నువ్వు అతి చెస్తున్నావు. మెడికల్ టూరిజం కోసం వచ్చే పాకిస్థానీలకు మేం ఇంకా వీసాలు ఇస్తున్నాం. నువ్వు ఇండియా వస్తే నేనే స్వయంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తా’ అని గంభీర్ ట్వీట్ చేశాడు.