సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు గౌరవం దక్కడంలేదని..తన ఆటతీరు చాలా చెత్తగా ఉందని టీమ్ యాజమాన్యం భావిస్తుందని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాలో జరుగుతున్న మాన్షి సూపర్ లీగ్‌కి గుడ్ బై చెప్పాడు ఈ వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్. తనకు జట్టులో కనీస గౌరవం, మర్యాద దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. తాను భారంగా మారిపోయానని జట్టు యాజమాన్యం భావించిన విషయాన్ని అర్థం చేసుకునే దాన్ని నుంచి తప్పుకున్నానన్నాడు. ఈ లీగ్‌లో జోజీ స్టార్స్ ఫ్రాంఛైజీ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మొత్తం టోర్నమెంట్‌లో గేల్‌కు 50కి పైగా పరుగులు ఒకసారి మాత్రమే చేశాడు. ఇదే సమయంలో క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నాడు.


