టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా ఇవాళ(శనివారం) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ ట్విటర్ వేదికగా తెలిపాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ట్వీట్ చేశాడు.
హర్భజన్, గీతా బస్రా దంపతులకు ఇప్పటికే హినాయ అనే పాప ఉంది. 2016 జులైలో వారికి తొలి సంతానం కలిగింది. ఆరోగ్యవంతమైన మగ బిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నామని అన్నాడు. తమ మంచిని కోరుతూ ఎప్పుడూ అండగా నిలిచి ప్రేమను పంచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు భజ్జీ.

