ఫుట్‌బాల్ ప్రపంచంలో విషాదం నెలకొంది. జర్మన్ ఫుట్‌బాల్ దిగ్గజం, ఫిఫా వరల్డ్ కప్ హీరో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్(78) కన్నుమూశారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన బెకెన్‌బౌర్.. సోమవారం ఉదయం నిద్ర లేవలేదు. ఘాడ నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు ప్రకటన చేశారు.
"మా తండ్రి ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ విషాద ఘటనతో మేము తీవ్ర విచారంలో మునిగిపోయాం.. ఈ సమయంలో మీరు మౌనం వహించాలి..ఏవేని ప్రశ్నలు అడగకుండా ఉండగలరని మేము ఆశిస్తున్నాం.." అని బెకెన్‌బౌర్ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆటగాడిగా, కోచ్‌గా బెకెన్‌బౌర్‌కు గొప్ప పేరుంది. అలాంటి వ్యక్తి దూరమవ్వవడంతో జర్మనీ ఫుట్‌బాల్ ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. వెస్ట్ జర్మనీ కెప్టెన్‌గా 1974లో ప్రపంచ కప్ గెలిచిన బెకెన్‌బౌర్.. 1990లో కోచ్‌గా మరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడారు. అంతేకాదు 1972లో ప్రతిష్ఠాత్మకమైన యూరో చాంపియన్‌షిప్ ట్రోఫీ విజేతగా నిలిచారు. కెరీర్ మొత్తంలో 582 ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిన ఆయన.. వెస్ట్ జర్మనీ తరఫున 104 మ్యాచ్‌లు, బేర్న్ మ్యునిచ్ తరఫున 400లకు పైగా మ్యాచ్‌లు ఆడారు.
We are deeply saddened by the passing of Franz Beckenbauer, one of football's greatest ever players
— Premier League (@premierleague) January 8, 2024
A World Cup winner as both player and manager, 'Der Kaiser' was as elegant as he was dominant
He will forever be remembered pic.twitter.com/dJDF4eAuod
The great Franz Beckenbauer gone now, so soon after Bobby Charlton. Bobby was given the job of keeping him quiet in the 1966 World Cup final. Maybe this is a very profound example of man to man marking. RIP. pic.twitter.com/JiuDuP5poS
— David Baddiel (@Baddiel) January 8, 2024
