హైదరాబాద్: 2,598 పాత వస్తువుల సేకరణ

హైదరాబాద్: 2,598 పాత  వస్తువుల సేకరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: డోర్‌‌‌‌ స్టెప్ ఫర్నిచర్ పికప్ కు 498 మంది స్పందించారని జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం తెలిపారు. 373 మంది వద్ద నుంచి పాత, ఉపయోగంలో లేని వస్తువులను సేకరించామన్నారు. 

మొత్తంగా ఇప్పటివరకు 2,598  వస్తువులు తీసుకున్నామని తెలిపారు. వాటిలో 325 పరుపులు , 205 సోఫాలు, 142 మంచాలు, 48 బీరువాలు, కప్​బోర్డులు, 38 టేబుళ్లు, 25 బుక్‌‌‌‌ షెల్ఫ్‌‌‌‌లు, ఇతరాలు ఉన్నాయన్నారు. ఎక్కువ రోజులు  పికప్ పెండింగ్‌‌‌‌లో ఉంటే, రిఫరెన్స్ నంబర్‌‌‌‌తో సమాచారం ఇవ్వాలన్నారు.