
హైదరాబాద్‌లోని మొజంజాహీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా అక్కడి పావురాలను జీహెచ్‌ఎంసీ అధికారులు శ్రీశైలం అడవులకు తరలించారు. మొజంజాహి మార్కె ట్ సుందరీకరణను పరిరక్షించడం, పావురాల ద్వారా శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఈ పావురాలను పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ శుక్రవారం చేపట్టింది. మొజంజాహి మార్కెట్‌లో శుక్రవారం బ్లాక్‌రాక్ పిజియన్ లుగా వ్యవహ రించే 500 పావురాలను వలల ద్వారా పట్టుకొనిఅట వీశాఖకు అప్పగించారు. ఈ పావురాలను అటవీ శాఖ సలహా మేరకు శ్రీశైలం రోడ్డులోని అట వీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. సిటీలో పావురాలకు ఫీడింగ్ (ఆహారగింజల )ను నిషేదించారు. మార్కెట్‌లో పావురాల ఫీడింగ్‌కు విక్రయిస్తున్న జొన్నలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.