హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాల స్వీకరణ మొదలైంది. 57 సర్కిల్ ఆఫీసులు, 6 జోనల్ ఆఫీసులతో పాటు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరించారు. ఇందుకోసం అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు అన్నిచోట్ల కలిపి 40 అభ్యంతరాలు వచ్చాయి.
బౌండరీల మార్పుపై ఎంఐఎం అభ్యంతరం
వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి బౌండరీల మార్పుపై ఎంఐఎం నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు మజీద్, కౌసర్ మొహియుద్దీన్, ముజీబ్ తో పాటు పలువురు కార్పొరేటర్లు కలిశారు. పెంచిన వార్డులపై అంసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బౌండరీల విషయంలో తిరిగి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
బీజేపీ కార్పొరేటర్లు కూడా..
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లను పూర్తిగా మూడు, నాలుగు ముక్కలుగా విభజించారని, ఇదంతా కావాలనే చేసినట్లు కనిపిస్తోందని పలువురు బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అభ్యంతరాలు వ్యక్తం చేయాలని స్పందన రాకపోతే ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీని గురించి గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్‌ను బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి, కార్పొరేటర్లు కలవనున్నారు.
పూర్తి వివరాలతో మ్యాప్‌లు ఇవ్వండి
వార్డుల విభజనకి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన మ్యాప్ లు ఇవ్వాలని కొందరు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీ, ఎస్టీ రిజర్వు ఉన్న వార్డుల రిజర్వేషన్లు మార్చవద్దని మరికొందరు కోరారు. గోషామహల్ నియోజకవర్గంలో నాలుగు ఎస్సీ డివిజన్లు కేటాయించాలని మాదిగ బంధుమిత్ర సంఘం హైదరాబాద్ జనరల్ సెక్రటరీ సుమన్ కుమార్ దరఖాస్తు చేశారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ సీటును ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎల్లేశ్కోరారు.
గ్రేటర్ అంతలా స్పిట్ బిన్లు ఏర్పాటు చేయాలని మరొక ఎక్స్ సర్వీస్మెన్కోరారు. అలాగే, కుత్బుల్లాపూర్సర్కిల్లోని సుభాష్‌నగర్ డివిజన్రెండుగా మారగా, సుభాష్‌నగర్, రాంరెడ్డినగర్అని పేర్లు పెట్టారు.అయితే, సుభాష్నగర్ప్రాంతమంతా రాంరెడ్డినగర్లోకి వెళ్లిందని, కాబట్టి రాంరెడ్డినగర్డివిజన్కు సుభాష్నగర్అని పెట్టి రాంరెడ్డినగర్ను సాయిబాబనగర్గా మార్చాలని విజయభాస్కర్‌రెడ్డి కోరారు.

