నీట్‌‌‌‌లో తక్కువ మార్కులు వస్తాయని యువతి అదృశ్యం

నీట్‌‌‌‌లో తక్కువ మార్కులు వస్తాయని యువతి అదృశ్యం

ఇబ్రహీంపట్నం, వెలుగు: నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ గ్రామానికి చెందిన నడిగోటి సిందూజ(19) రెండేళ్లుగా నీట్ లాంగ్‌‌‌‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. 

జూన్ 21న నీట్ పరీక్ష రాసిన ఆమె, అనంతరం కీ చూసుకుని తనకు తక్కువ మార్కులు వస్తాయని, సీటు రాకపోవచ్చని తండ్రి నర్సింహకు తెలిపింది. మరోసారి కోచింగ్ తీసుకుందామని తండ్రి ధైర్యం చెప్పాడు. జూన్ 23న అర్ధరాత్రి నుంచి సిందూజ కనిపించకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు.