నెలలు నిండని పసికందుకు ప్రాణం పోసిన్రు

నెలలు నిండని పసికందుకు ప్రాణం పోసిన్రు
  • 4  నెలల పాటు ట్రీట్ మెంట్​తో 
  • చిన్నారిని బతికించిన మెడికవర్ డాక్టర్లు   


మాదాపూర్, వెలుగు : నెలలు నిండకుండానే తక్కువ బరువు, తీవ్ర ఆనారోగ్య సమస్యలతో పుట్టిన చిన్నారికి మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు బతికించారు. తల్లికి డయాబెటిస్, హైపోథైరాయిడిజం ఉండటంతో పుట్టుకతోనే చిన్నారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. గత నవంబర్​లో 6 నెలలకే ఈ చిన్నారి జన్మించింది.  వెంటనే డాక్టర్లు ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు. 4  నెలల పాటు ట్రీట్ మెంట్ చేయటంతో ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంగా తయారైంది. ఈ సందర్భంగా ట్రీట్ మెంట్ అందించిన డాక్టర్ రవీందర్ ఆయన టీమ్ తో కలిసి మీడియా తో మాట్లాడారు. క్రిటికల్ గా ఉన్న చిన్నారిని ఎలాగైనా బతికించాలని ఈ కేసును సవాల్ గా తీసుకున్నామని చెప్పారు. ఇంక్యుబేటర్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌ఐసీయూకు మార్చి నిరంతరంగా పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్‌‌‌‌‌‌‌‌తో శ్వాస అందించామన్నారు. పాప శ్వాస తీసుకోవటం మొదలుపెట్టాక ఐవీ  ఫ్లూయిడ్స్, యాంటీ బయాటిక్స్ , ట్యూబ్ ద్వారా పాలు ఇవ్వడంతో ఆరోగ్యం మెరుగైందన్నారు. పుట్టినప్పుడు 550 గ్రాములు మాత్రమే ఉన్న పాప ట్రీట్ మెంట్  తర్వాత  2.5 కేజీల బరువు పెరిగింది.  పాప పూర్తి  ఆరోగ్యంగా ఉండటంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ మంజులా అనగాని,  హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ లాల్, డాక్టర్లు నవిత, శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శశిధర్ (సెంటర్ హెడ్),  రాకేష్ (మెడికల్ డైరెక్టర్ ) తదితరులు పాల్గొన్నారు.