శాంతి నెలకొనాలంటే ఒప్పందాలకు చైనా కట్టుబడాలి

శాంతి నెలకొనాలంటే ఒప్పందాలకు చైనా కట్టుబడాలి

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు సంక్లిష్టంగా మారాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఈ తరుణంలో గ్లోబల్ వైడ్ గా ఇండియాను మరింత శక్తిమంతం చేసేందుకు అవసరమైన అన్ని వనరులనూ ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. చైనాతో సరిహద్దు వివాదం పైనా జైశంకర్ మాట్లాడారు. శాంతి పునరుద్ధరణకు సంబంధించిన అగ్రిమెంట్లకు చైనా కట్టుబడితేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మునుపటిలా ఉంటాయని స్పష్టం చేశారు. 

'భారత్, చైనా సంబంధాలు మధ్య కూడలిలో ఉన్నాయి. మేం ఏ వైపుగా వెళ్తామనేది చైనా వైఖరిని బట్టి ఉంటుంది. శాంతి ఒప్పందాల మీద చైనా కట్టుబడాలి. ఇది జరిగితే కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయో అలాగే కొనసాగుతాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాలని ఎవరమూ అనుకోవడం లేదు' అని జైశంకర్ పేర్కొన్నారు.