బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులతో ఇప్పటికే నష్టాల్లో ఉంటే బార్లపై జీవో నంబర్ 145 తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. బార్లను వేరే చోటుకు మార్చుకునేందుకు రూ.16 లక్షలు ఉన్న ఫీజును రూ.30 లక్షలకు పెంచారన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడిగా బి. అరుణ్ రాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకటేశ్‌ను ఎన్నుకున్నారు.
