- ఉప్పల్ రామంతాపూర్‌లో ఎనిమిదిన్నర తులాల బంగారం, 65 తులాల వెండి దోపిడీ
- ఆసిఫ్ నగర్లో 13 తులాల బంగారం ఎత్తుకెల్లిన దొంగలు
ఉప్పల్/ఓల్డ్‌సిటీ, వెలుగు: ఉప్పల్ రామంతాపూర్, ఓల్డ్‌సిటీలోని ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో పట్టపగలే రెండు ఇండ్లలో బంగారం దొంగతనాలు జరిగాయి. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. ఉప్పల్ రామంతాపూర్‌లోని వాసవినగర్‌లో మల్లయ్య అనే వ్యక్తి నివాసముంటున్నారు. పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 8.50 తులాల బంగారం, 65 తులాల వెండి, రూ.25 వేల నగదు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆసిఫ్‌నగర్ హుడా కాలనీలో నివసించే ప్రభాకర్ రావు గురువారం విజయ డయాగ్నస్టిక్ సెంటర్ హాస్పిటల్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 13 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఆనంద్ తెలిపారు.
