బంగారం, వెండి ధరలు మరింత పైపైకి

బంగారం, వెండి ధరలు మరింత పైపైకి

రెండు రోజుల్లోనే 10 గ్రా. బంగారం రూ. 1,500

 వెండి కేజీ రూ. 6 వేలు పెరుగుదల

బంగారం ధర రూ.54 వేల పైన…..  వెండి ధర కూడా రూ.67 వేల పైనే

ట్రేడ్ టెన్షన్లు…… కరోనాలే….  ప్రధాన కారణం

 న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు భగ్గు మంటున్నాయి. ప్రతి రోజూ సరికొత్త రికార్డులతో వినియోగదారులకు అందకుండా పరుగులు పెడుతున్నాయి. కరోనా కారణంతో ఒక వైపు వినియోగం పడిపోయినా.. ధరలకు మాత్రం ఎక్కడా బ్రేక్ లేదు. శ్రావణమాసం పెళ్లిళ్లకు సీజన్. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి.

బంగారం ధర రూ.52 వేలకు పైన, వెండి ధర కేజీకి రూ.67 వేలకు పైన నమోదై రికార్డు సృష్టించాయి. ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్‌ లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.52,410గా నమోదైంది. సిల్వర్ ఫ్యూచర్స్ 2 శాతం ఎగిసి కేజీకి రూ.67,560గా ఉంది. కేవలం ఆరు రోజుల్లోనే వెండి ధరలు 25 శాతం మేర పెరిగాయి. గత వారం కేజీ వెండి రూ.54 వేలుగా ఉంటే, మంగళవారం నాటికి రూ.67,560కు పెరిగింది. కేవలం రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 మేర ఎగిసింది. హైదరాబాద్ లో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 54,220కి చేరింది. కిలో వెండి ధర రూ. 67 వేలు పలికింది.

అమెరికా–చైనా దేశాల మధ్య టెన్షన్లు పెరగడం, కరోనా కారణంతో ప్రభావితమైన ఎకానమీలకు సపోర్ట్ ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు, ప్రభుత్వాలు స్టిములస్ ప్యాకేజీలు ప్రకటించడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటివి గోల్డ్, సిల్వర్ ధరలకు సపోర్ట్ నిస్తున్నాయి. అమెరికా డాలర్ బలహీనపడటం కూడా ఈ ఇండస్ట్రియల్ మెటల్స్‌‌‌‌‌‌‌‌ కు బెనిఫిట్‌ గా మారుతోంది. సప్లైలో ఇబ్బందులు కూడా దీని ధరలు పెరిగేందుకు సహకరిస్తున్నాయి. ఈ ఏడాది మైన్ ప్రొడక్షన్ 7 శాతం మేర తగ్గినట్టు సిల్వర్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టి ట్యూట్ అంచనావేస్తోంది. కొన్ని దేశాల ఎకానమీలు రికవరీ అవడంతో, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీలో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాం డ్ పెరుగు తున్నట్టు కొందరు అనలిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నారు.

ఈ వారంలో జరిగే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్‌ లో కూడా గోల్డ్, సిల్వర్ ట్రేడర్లకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడనున్నాయని కొం దరంటున్నారు. మళ్లీ ఫెడ్ వడ్డీ రేట్లను జీరోకు దగ్గర గా తీసుకురావాలని చూస్తున్నట్టు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సంకేతాలిచ్చారు. స్పాట్ గోల్డ్ ధరలు కూడా ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఒక ఔన్స్‌‌‌‌‌‌‌‌ స్పాట్ గోల్డ్ ధర 1,975 డాలర్లగా నమోదైంది. త్వరలోనే రెండు వేల డాలర్ల మార్క్‌‌‌‌‌‌‌‌ని తాకుతుందని కూడా అనలిస్ట్‌‌‌‌‌‌‌‌లు అంచనావేస్తున్నారు. ఆరు సెషన్స్‌‌‌‌‌‌‌‌లోనే స్పాట్ గోల్డ్ ధర 160 డాలర్ల మేర పెరిగింది. వెండి కూడా ఇదే మాదిరి ర్యాలీ చేస్తోంది. 2013 సెప ్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత మొట్టమొదటిసారి ఒక ఔన్స్‌‌‌‌‌‌‌‌ 25.81 డాలర్లను తాకింది. మార్చిలో కనిష్ట స్థాయిలను తాకిన వెండి ఆ తరువాత రెండింతలైంది.

గోల్డ్, సిల్వర్ హోల్డింగ్స్ పెరుగుతున్నాయ్!

ఈటీఎఫ్ ఇన్వెస్టర్లు ఎక్కువగా తమ మనీని కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరోనా కారణంతో గ్లోబల్ ఎకానమీ ప్రమాదంలో ఉండటంతో, సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా గోల్డ్, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భావించి తమ మనీని ఎక్కువగా కమోడిటీల్లో పెట్టుబడి పెడుతున్నట్టు అనలిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెప్పారు. ఎస్‌‌‌‌‌‌‌‌పీడీ ఆర్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ హోల్డింగ్ స్ 1.75 టన్నులు పెరిగి 1,228.805 టన్నులకు చేరుకున్నాయి. 2013 మార్చి తర్వాత ఇదే హయ్యస్ట్. గోల్డ్ ధరలు కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయని, పెరుగు తోన్న ధరలు ఇండియా, చైనా లాంటి దేశాల్లో కన్జూ మర్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీస్తాయని కొటక్ సెక్ యూరిటీస్ తెలిపింది.

రూ.65వేలకు చేరుకుంటుంది

గోల్డ్ ధరలు మరింత పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సి ల్ మేనేజింగ్ డైరె క్టర్(ఇండియా) సోమసుందరమ్ పీఆర్ అంచనావేస్తున్నారు. వడ్డీ రేట్లు పడిపోవడం, కరోనా ప్రభావం, జియో పొలిటికల్ టెన్షన్లు, రూపాయి–డాలర్ ఎక్స్చేంజ్ రేటు, కరోనా కారణంతో గ్లోబల్ ఎకానమీ పడిపోవడం వంటివి గోల్డ్‌‌‌‌‌‌‌‌పై బుల్లిష్ సెంటిమెం ట్‌ ను కలుగజేస్తున్నాయని పేర్కొ న్నారు. మరోవైపు ఈ ఏడాదే అమెరికా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దీం తో వచ్చే 12 నెలల్లో దేశీయ మార్కె ట్‌లో గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.65 వేలు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని జ్యూవల్లరీ బ్రాండ్ పీఎన్ గాడ్గిల్ ఎండీ, సీఈవో సౌరభ్ గాడ్గిల్ అన్నారు. ఇంటర్నేషనల్ మార్కె ట్లలో ఔన్స్‌‌‌‌‌‌‌‌కు 2,500 డాలర్లు చేరుకుంటుం దని ఆయన భావిస్తున్నారు.