
పోర్షే ఇండియా సరికొత్త పనామెరాను రూ. 1,69,62,000 (ఎక్స్-షోరూమ్, కోల్‌కతా) ప్రారంభ ధరతో విడుదల చేసింది. జర్మనీలోని స్టట్‌గార్ట్ ఫ్యాక్టరీ నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ రూపంలో దీనిని దిగుమతి చేసుకుంటోంది. కారు డెలివరీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సూపర్ స్పోర్ట్ సెడాన్లో 2.9- లీటర్ ట్విన్ -టర్బో వీ6 ఇంజన్ ఉంది. ఇది 349 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 500ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం 272 కిలోమీటర్లు. కేవలం 5.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.