V6 News

శాంతి చర్చల పురోగతితో 2వ రోజూ పెరిగిన గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లివే..

శాంతి చర్చల పురోగతితో 2వ రోజూ పెరిగిన గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లివే..

ఇరాన్, అమెరికా ప్రస్తుతానికి కాల్పుల విరమణను కొనసాగిస్తున్నాయి. త్వరలోనే రెండో దఫా చర్చలు ఉంటాయని వస్తున్న వార్తలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లలో కూడా కొంత బుల్స్ జోరు కనిపించటంతో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్లలో సంతోషం స్టార్ట్ అయ్యింది. అయితే రిటైల్ రేట్లు పెరుగుతున్న వేళ ఆభరణాలు కొనాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో మారిన రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

ఏప్రిల్15న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 14 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.142 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 535గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 240గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్8, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.15వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 75వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర ఎలాంటి మార్పులు లేకుండా రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి.