మన ఇషాకు స్వర్ణం.. ISSF‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సత్తాచాటిన హైదరాబాదీ

మన ఇషాకు స్వర్ణం.. ISSF‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సత్తాచాటిన హైదరాబాదీ

తెలంగాణ స్టార్‌‌‌‌ షూటర్‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌.. ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో స్వర్ణంతో మెరిసింది. సోమవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌ ఫైనల్లో ఇషా 40 హీట్స్‌‌‌‌తో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ విజేత మను బాకర్‌‌‌‌ 28 హిట్స్‌‌‌‌తో కాంస్యం సొంతం చేసుకుంది. అత్యంత కఠినమైన ప్రత్యర్థులతో చివరి వరకు పోరాడిన మను.. కీలకమైన షూటాఫ్‌‌‌‌లో గెలిచి మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచింది.

హాంగ్జౌ: తెలంగాణ స్టార్‌‌ షూటర్‌‌ ఇషా సింగ్‌‌.. ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో స్వర్ణంతో మెరిసింది. సోమవారం జరిగిన విమెన్స్‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌ ఫైనల్లో ఇషా 40 హీట్స్‌‌తో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. పారిస్‌‌ ఒలింపిక్స్‌‌ విజేత మను భాకర్‌‌ 28 హీట్స్‌‌తో కాంస్యం సొంతం చేసుకుంది. అత్యంత కఠినమైన ప్రత్యర్థులతో చివరివరకు పోరాడిన మను కీలకమైన షూటాఫ్‌‌లో గెలిచి మూడో ప్లేస్‌‌ను సాధించింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో మను 586–20 ఎక్స్‌‌తో అగ్రస్థానంలో నిలవగా, ఇషా 585–18 ఎక్స్‌‌తో రెండో ప్లేస్‌‌తో ఎనిమిది మందితో కూడిన ఫైనల్స్‌‌కు అర్హత సాధించారు. 

ఆసియా గేమ్స్‌‌ మాజీ గోల్డ్‌‌ మెడలిస్ట్‌‌ రాహీ సర్నోబాత్‌‌ 582–16 ఎక్స్‌‌ పాయింట్లు సాధించగా, కేవలం ర్యాంకింగ్‌‌ పాయింట్ల కోసం పోటీపడిన సిమ్రన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ బ్రార్‌‌ (576–20 ఎక్స్‌‌), అభిజ్ఞ అశోక్‌‌ పాటిల్‌‌ (573–16 ఎక్స్‌‌) స్థిరమైన ప్రదర్శన చూపెట్టారు. ‘గతంలో నేను సాధించిన మెడల్స్‌‌ కారణంగా ఈ మ్యాచ్‌‌లో నాపై చాలా ఒత్తిడి ఉంది. ఈ రోజు దాన్ని అధిగమించా. చివరివరకు మెరుగ్గా రాణించడం వల్లే పోడియం ఫినిష్‌‌ చేయగలిగా’ అని ఇషా పేర్కొంది. మెడల్స్‌‌ గెలిచిన ఇషా, మను భాకర్‌‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌‌ మాండవీయ అభినందించారు.