భారత ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాలు పెంచిన తర్వాత మెల్లమెల్లగా గోల్డ్ రేట్లు తగ్గుతూపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం రోజున వెండి దిగుమతులపై కూడా ఆంక్షలు పెట్టడంతో రేటు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆభరణాలు కొనాలనుకుంటున్నట్లయితే ముందుగా వారి నగరాల్లో మారిన రేట్లను పరిశీలించటం చాలా మంచిది.
మే 18న బంగారం రేట్లు తగ్గాయి. మే 17 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.71 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 622గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 320గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 18, 2026న కేజీకి రూ.10వేలు పెరిగింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.10వేలు పెరిగి రూ.3లక్షలకు చేరుకుంది. అంటే గ్రాము దాదాపుగా రూ.300 దగ్గర కొనసాగుతుందన్నమాట.
