మళ్లీ పెరిగిన బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి రేటు ఎలా ఉందంటే?

మళ్లీ పెరిగిన బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి రేటు ఎలా ఉందంటే?

ఈ వారం బంగారం రేట్లు మళ్లీ పెరుగుదలను కొనసాగిస్తున్నాయి. గతవారం తగ్గుతూ వచ్చిన గోల్డ్ గడచిన రెండు రోజులుగా తిరిగి పుంజుకుంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు బంగారం, వెండి రేట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం బెటర్.

మే20న బంగారం రేట్లు పెరిగాయి. మే 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.131 పెరిగాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 835గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 515గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 20, 2026న కేజీకి రూ.5వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు ఎలాంటి మార్పులు లేకుండా రూ.3లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.300 దగ్గర ఉంది.