మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్‌లో ఈరోజు (5 మే 2025) బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న దాడుల వల్ల ఇంధన ధరలు పెరిగి, సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడేలా ఉంది.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి నుండి వెళ్తున్న రెండు అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు చేయడానికి ప్రయత్నించగా, అమెరికా దళాలు వాటిని అడ్డుకున్నాయి.
ఇరాన్ పంపిన క్షిపణులను తాము అడ్డుకున్నట్లు యూఏఈ తెలిపింది. అలాగే, అమెరికా ఓడరేవులో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఇరాన్ డ్రోన్ దాడే కారణమని యూఏఈ ఆరోపించింది.
చమురు ధరలు :
మంగళవారం ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 1.5% తగ్గి, బ్యారెల్‌కు సుమారు $113 వద్ద ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ 2.5% తగ్గి, బ్యారెల్‌కు $104 కంటే తక్కువకు చేరుకుంది. అమెరికా డాలర్ విలువ 98.5 పాయింట్ల వద్ద నిలకడగా కొనసాగుతోంది.
ఈ రోజు (5 మే 2026) 1 గ్రాము 24క్యారెట్ల బంగారం ధర రూ.44 తగ్గి రూ.14,918, 22క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గి రూ.13,675, 18క్యారెట్ల బంగారం ధర రూ.33 పడిపోయి రూ.11,189గా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,180తో రూ.440 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,750తో రూ.400 తగ్గగా..18 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,890 పడిపోయి రూ.330 తగ్గింది.
మరోవైపు వెండి గ్రాము ధర రూ.5 తగ్గి రూ.265 ఉండగా.. కిలోకి రూ.2,65,000తో రూ.5 వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు చూస్తే
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల ధర 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 49 వేల 180, 22 క్యారెట్ల ధర రూ.1 లక్ష 36 వేల 750, 18 క్యారెట్ల ధర రూ.1 లక్ష 11 వేల 890.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల ధర 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 49 వేల 180, 22 క్యారెట్ల ధర రూ.1 లక్ష 36 వేల 750, 18 క్యారెట్ల ధర రూ.1 లక్ష 11 వేల 890.
