చెన్నైకి గుడ్ న్యూస్.. బెన్​ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌

చెన్నైకి గుడ్ న్యూస్..  బెన్​ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌

చెన్నై: చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌న్యూస్‌‌‌‌‌‌‌‌. బొటన వేలి గాయంతో గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరంగా ఉన్న ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌.. శుక్రవారం సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. అతను ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడని సీఎస్‌‌‌‌‌‌‌‌కే మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది.

అయితే మోకాలి గాయం నుంచి స్టోక్స్​ ఇంకా కోలుకోవాల్సి ఉన్నా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని తెలిపింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ధోనీ కూడా  ఫుల్​ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తోనే ఉన్నాడని, అతను ఇంజ్యురీని బాగా మేనేజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడని చెప్పింది.