DSC – 1998 క్వాలిఫైడ్స్ కు శుభవార్త

DSC – 1998 క్వాలిఫైడ్స్ కు శుభవార్త

Good news to DSC - 1998 Qualifiedsఅమరావతి: ఏపీ ప్రభుత్వం డీఎస్సీ – 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. 1998లో DSCలో క్వాలిఫైడ్ అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సుదీర్ఘంగా ఉన్న 1998 DSC పెండింగ్ డిమాండ్ పరిష్కారం అయినట్టయిందని మంత్రులు అభిప్రాయపడ్డారు.  అలాగే, 2008లో DED, BED అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు

1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. వీరికి నెలకు రూ.398 కన్సాలిడేటెడ్‌గా చెల్లిస్తున్నారు.